షాపింగ్‌మాల్‌లో మంటలు.. లక్షలు విలువచేసే వస్త్రాలు దగ్ధం - ఒడిశా
🎬 Watch Now: Feature Video
BMC Mall Fire: ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని ఓ షాపింగ్ మాల్లో శుక్రవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మార్కెట్ బిల్డింగ్ సమీపంలోని బీఎంసీ కేశరి మాల్లో ఉన్న వస్త్ర దుకాణంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, అయితే.. లక్షల రూపాయల విలువచేసే వస్త్రాలు బూడిదైనట్లు అధికారులు చెప్పారు. మాల్లోని వస్త్ర దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST