10 అడుగులు ఎత్తైన ఈ ట్రాక్టర్‌తో నదులు చెరువులనూ దాటేయొచ్చు - ముజఫర్‌నగర్‌లో 10 అడుగుల ట్రాక్టర్
🎬 Watch Now: Feature Video
కాలువలు, నదులు దాటేందుకు కష్టంగా ఉందని భావించిన ఓ రైతు విన్నూత్నంగా ఆలోచించాడు. తన వద్దనున్న ఐదు అడుగుల ట్రాక్టర్ ఎత్తును ఏకంగా పది అడుగులకు పెంచేశాడు. దీంతో ఇప్పుడు కాలువలు, చెరువులు ఈజీగా దాటేయచ్చంటున్నాడు. దీని ద్వారా వ్యవసాయ పనులు కూడా సులభతరం అవుతుందని రైతు తెలిపాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ రోడ్లల్లో కనువిందు చేసే ఈ వింత ట్రాక్టర్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST