బైక్‌పై వెళ్తుండగా వృద్ధుడికి గుండెపోటు.. సెకన్ల వ్యవధిలోనే.. - బైక్‌పై నుంచి కుప్పకూలిన వృద్ధుడు
🎬 Watch Now: Feature Video
బైక్‌పై వెళ్తున్న ఓ వృద్ధుడికి హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. సెకన్ల వ్యవధిలో అతడు బైక్‌పై నుంచి రోడ్డు మీద పడిపోయాడు. వెంటనే రోడ్డుపై ఉన్న ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. వృద్ధుడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బైకర్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌లో శుక్రవారం జరిగింది.
అసలేం జరిగిందంటే..
అలీగఢ్‌లోని జ్వాలాపురికి చెందిన పరమానంద్(60) అనే వృద్ధుడు బైక్‌పై మథుర బైపాస్ రోడ్డు మీద వెళ్తున్నాడు. అయితే భారత్ పెట్రోల్ బంక్ వద్దకు వచ్చేసరికి ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దీంతో బైక్‌పై నుంచి పరమానంద్ కుప్పకూలాడు. సమాచారం అందుకున్న పోలీసులు పరమానంద్‌ను ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. అప్పటికే పరమానంద్ మృతి చెందాడు. ఈ ప్రమాద దృశ్యాలు పెట్రోల్ బంకులోని సీసీటీవీలో రికార్డయ్యాయి. పరమానంద్ మరణవార్త విన్న అతడి కుమారుడు మనోజ్ ఆస్పత్రికి వచ్చాడు. అతడు తండ్రి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా ఏడ్చాడు.