Conductor Died After Falling Down From Bus Viral video : బస్సు నుంచి కింద పడి కండక్టర్ మృతి.. అదే కారణమట! - రన్నింగ్ బస్సులో నుంచి కిందపడ్డ కండక్టర్
🎬 Watch Now: Feature Video
Published : Aug 30, 2023, 10:56 PM IST
|Updated : Aug 31, 2023, 10:45 AM IST
Conductor Died After Falling Down From Bus Viral video : బస్సులో నుంచి కింద పడి కండక్టర్ చనిపోయిన ఘటన కర్ణాటకలో జరిగింది. మంగళవారం మధ్యాహ్నం జరిగిందీ దుర్ఘటన. మృతుడ్ని ఈరయ్యగా పోలీసులు గుర్తించారు. అతడు మంగళూరు జిల్లాలోని బాగల్‌కోటే ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఈరయ్య(23) మంగళూరు సిటీలో ఓ ప్రైవేట్ బస్సులో కండక్టర్ పనిచేస్తున్నాడు. బస్సు కేపీటీ నుంచి వస్తుండగా.. నంటూర్ రౌండ్ అబౌట్ వద్ద ఘటన జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు అతడు బస్సు డోర్ వద్ద నిల్చున్నాడు. భారీ మలుపు వద్ద బస్సు వేగంగా వెళ్లడం వల్ల అదుపుతప్పి కిందపడ్డాడు. వెంటనే అప్రమత్తమైన అక్కడున్న ట్రాఫిక్ కానిస్టేబుల్.. స్థానికుల సాయంతో బాధితుడ్ని ఆటోలో ఆసుపత్రికి తరలించారు. తలకు తీవ్ర గాయం కావడం వల్ల చికిత్స పొందుతూ ఈరయ్య మృతి చెందాడు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు.