CID Call Record Petition Judgment on Oct 31st: సీఐడీ కాల్‌డేటా పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. ఈ నెల 31న తీర్పు
🎬 Watch Now: Feature Video
Published : Oct 27, 2023, 5:26 PM IST
CID Call Record Petition Judgment on Oct 31st: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో అక్కడున్న సీఐడీ అధికారుల కాల్‌డేటా రికార్డు కావాలని కోరుతూ.. దాఖలు చేసిన పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. విచారణలో భాగంగా ఇరుపక్షాల న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి.. తీర్పును రిజర్వ్ చేశారు. అనంతరం ఈ నెల 31వ తేదీన తుది తీర్పును వెల్లడిస్తామని తెలిపారు.
CID Officials Call Record Petition Updates: చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసే సమయానికి ముందు.. సీఐడీ అధికారులు పలువురిని ఫోన్ ద్వారా సంప్రదించారని, ఆ వివరాలు తెలిస్తే అరెస్టులో కీలక విషయాలు బయటపడతాయని.. చంద్రబాబు తరఫు న్యాయవాది కొన్ని రోజుల క్రితం విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారించిన ఏసీబీ కోర్ట్.. తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో సీఐడీ కాల్‌డేటా అంశంపై శుక్రవారం మరోసారి విచారణ జరిపిన న్యాయస్థానం.. వాదనలు ముగిస్తూ, తీర్పును ఈ నెల 31వరకు రిజర్వ్ చేసింది.