Chandrayaan 3 Soft Landing : ల్యాండర్ అడుగుపెడుతున్నప్పుడు చంద్రుడిని చూశారా?
🎬 Watch Now: Feature Video
Published : Aug 24, 2023, 10:24 PM IST
|Updated : Aug 25, 2023, 6:15 AM IST
Chandrayaan 3 Soft Landing Video : చంద్రయాన్ 3 ప్రయోగానికి సంబంధించి మరో వీడియోను విడుదల చేసింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో). చంద్రయాన్ 3 ల్యాండర్ చందమామపై దిగుతుండగా దానికి అమర్చిన కెమెరాలో రికార్డు అయిన వీడియోను షేర్ చేసింది. చంద్రుడిపై ల్యాండర్ దిగడానికి కొన్ని కి.మీల ముందు మొదలైన ఈ వీడియో.. చంద్రుడిపై అడుగుపెట్టేవరకు రికార్డయింది. ఇప్పటివరకు ల్యాండర్ 'విక్రమ్' తీసిన కొన్ని ఫొటోలను విడుదల చేసిన ఇస్రో.. 'అడుగుపెట్టడానికి ముందు ల్యాండర్ ఇమేజర్ కెమెరా జాబిల్లి చిత్రాన్ని ఎలా క్యాప్చర్ చేసిందో చూడండి' అంటూ 2 నిమిషాల 17 సెకన్ల నిడివి ఉన్న వీడియోను ఇస్రో తాజాగా షేర్ చేసింది.
అంతకుముందు.. ల్యాండర్ చండ్రుడిపై కాలుమోపిన అనంతరం ప్రగ్యాన్ రోవర్ బయటకు వచ్చి తన పనిని సాఫీగా చేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఇది చంద్రుడిపై 14 రోజుల పాటు పరిశోధనలు చేయనుందని వెల్లడించింది. కాగా చంద్రుడి దక్షిణ దృవంపై కాలుమోపిన భారత్ సరికొత్త చరిత్రను సృష్టించింది. జులై 14న షార్ నుంచి చంద్రయాన్-3 ప్రయోగం జరిగింది. అనంతరం 41 రోజులు ప్రయాణించి చంద్రుడిపై దిగింది విక్రమ్ ల్యాండర్. జాబిలిపై విజయవంతంగా అడుగు పెట్టి ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు అందుకుంటోంది ఇస్రో.