Chaitanya Krishna First Reaction On Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన నందమూరి చైతన్యకృష్ణ... వీడియో విడుదల - ఏపీతాజా
🎬 Watch Now: Feature Video
Published : Sep 11, 2023, 5:24 PM IST
Chaitanya Krishna First Reaction On Chandrababu Arrest: మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌పై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు, పార్టీ కార్యకర్తలు, పలుపార్టీ నేతలు... చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తున్నారు. తాజాగా నందమూరి జయకృష్ణ కుమారుడు చైతన్యకృష్ణ చంద్రబాబు అరెస్ట్(Chandrababu Arrest) పై స్పందించారు. చంద్రబాబును అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. చంద్రబాబునాయుడును కాపాడుకునేందుకు ప్రభుత్వంపై పోరాటం చేయాలని తెలుగుదేశం కుటుంబసభ్యులకు, ప్రజలకు పిలుపునిచ్చారు.
నారా చంద్రబాబు అరెస్ట్‌పై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు స్పందించాలని పిలుపునిచ్చారు. నిన్న ఒడిపోయింది చంద్రబాబు(Chandrababu) కాదని, అవినీతి గెలిచిందని చైతన్యకృష్ణ పేర్కొన్నారు. వైసీపీ(YCP) ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వాధికారులను ప్రలోభాలకుగురిచేసి చంద్రబాబును అరెస్ట్ చేశారంటూ చైతన్యకృష్ణ ఆరోపించారు. ఈ అవినీతి ప్రభుత్వానికి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. లక్ష కోట్లు అక్రమంగా సంపాంధించిన వ్యక్తి బయట తిరుగుతున్నాడని.. రాజకీయాల ద్వారా రూపాయి కూడా సంపాదించని వ్యక్తిని నేడు జైల్లో పెట్టారని విమర్శించారు. ఈ మేరకు చైతన్య కృష్ణ(Chaitanya Krishna) వీడియోను విడుదల చేశారు.