కుక్క పిల్లల పైనుంచి కారును తీసుకెళ్లిన డ్రైవర్ ​ తల్లడిల్లిన తల్లి - ఫరీదాబాద్​ క్రైమ్​ న్యూస్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 19, 2022, 9:06 AM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

హరియాణాలో ఓ వ్యక్తి మూగజీవాలపై కర్కశంగా వ్యవహరించాడు. ఫరీదాబాద్​ జిల్లా బల్లబ్​గఢ్​​ ప్రాంతంలో రోడ్డుపై ఓ కుక్క తన పిల్లలతో సహా ఉంది. అదే సమయంలో అటుగా ఓ కారు వచ్చింది. వాటిని చూసిన కారు డ్రైవర్ పక్కకు పోనివ్వలేదు. కనికరం లేకుండా వాటిపై నుంచి కారును తీసుకెళ్లాడు. దీంతో వాటిలో ఓ కుక్కపిల్ల మృతి చెందింది. మరి కొన్నింటికి గాయాలయ్యాయి. అయితే మృతి చెందిన తన పిల్లను చూస్తూ తల్లి దాని చుట్టూ తిరుగుతూ అరుస్తూ ఉంది. ఈ సన్నివేశమంతా దగ్గర్లోని ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డ్​ అయింది. దీంతో పోలీసులు నిందితుడుపై కేసు నమోదు చేసి అరెస్ట్​ చేశారు. ఈ ఘటన డిసెంబర్​ 12న జరిగింది.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.