BJP on Janasena TDP Alliance For Upcoming Polls: టీడీపీతో జనసేన పొత్తు.. స్పందించిన రాష్ట్ర బీజేపీ - వైసీపీ నేతలపై బీజేపీ
🎬 Watch Now: Feature Video
Published : Sep 14, 2023, 5:43 PM IST
BJP on Janasena TDP Alliance For Upcoming Polls in AP: ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అధికార వైసీపీ తాను తీసుకున్న గొయ్యిలో తానే పడే విధంగా పరిస్థితులు మారుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్, వేధింపుల నేపథ్యంలో తెలుగుదేశంపై సానుకూల భావనలు మెుదలవుతున్నాయి. ఈ సందర్భంగా చంద్రబాబును జైల్లో కలిసిన పవన్ కల్యాణ్.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తుకు వెళ్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. అంతేకాకుండా తెలుగుదేశం-జనసేన పోరాటానికి బీజేపీ సైతం తమతో కలిసి వస్తుందని నమ్ముతున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎవ్వరు వచ్చినా.. రాకపోయినా తెలుగుదేశం-జనసేనలు కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాయని స్పష్టం చేశారు.
పవన్ వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ స్పందించింది. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందని పవన్ కల్యాణ్ అభిప్రాయమని వెల్లడించింది. పొత్తుల అంశంపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది. ప్రస్తుతానికి ఏపీలో జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని రాష్ట్ర నాయకత్వం వెల్లడించింది. అయితే, టీడీపీ, జనసేన పొత్తులపై వైసీపీ నేతలు స్పందించారు. అన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా వైసీపీ విజయం ఖాయమని దీమా వ్యక్తం చేశారు.