బావిలో పడ్డ భారీ అడవి దున్న.. మత్తుమందు ఇచ్చి.. క్రేన్​ సహాయంతో.. - అడవి దున్నను కాపాడిన అధికారులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 10, 2023, 3:38 PM IST

Updated : Aug 10, 2023, 3:56 PM IST

Bison Fell Into Well : కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఓ వ్యవసాయ బావిలో పడ్డ అడవి దున్నను అటవీ శాఖ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది.. సంయుక్త ఆపరేషన్​ నిర్వహించి కాపాడారు. అడవి దున్నతో పాటు రెండు అడవి పందులను కూడా రక్షించారు. అసలేం జరిగిందంటే?

జిల్లాలోని చిప్పలి లింగదహళ్లి గ్రామంలో ఓ 25 అడుగుల వ్యవసాయ బావిలో అడవి దున్న.. బుధవారం ఉదయం పడిపోయింది. అదే సమయంలో రోడ్డు దాటుతుండగా.. రెండు అడవి పందులు కూడా పడ్డాయి. వెంటనే స్థానికులు.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది దున్నను బయటకు తీసేందుకు యత్నించి విఫలమయ్యారు. దున్న.. అధిక బరువు ఉండడం వల్ల వారికి సాధ్యం కాలేదు.

దీంతో వారు.. అటవీశాఖ అధికారులను సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పశు వైద్యుడు మురళీ మోహన్​.. దున్నకు మత్తు మందు ఇచ్చారు. ఆ తర్వాత దున్న స్పృహ కోల్పోయింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది.. బావిలోకి దిగి దున్నను తాళ్లతో కట్టారు. క్రేన్ సహాయంతో అంతా కలిపి దున్నను బయటకు తీశారు.
అయితే దున్నకు ఇచ్చిన మత్తుమందు మూడున్నర గంటలు మాత్రమే ఉంటుందని.. అందుకే 40 నిమిషాల్లోనే బయటకు తీసినట్లు వైద్యులు మురళీ మోహన్​ తెలిపారు. బయటకు తీసిన తర్వాత దున్నకు స్పృహ వచ్చిందని.. అడవిలోకి వెళ్లపోయిందని చెప్పారు. 

Last Updated : Aug 10, 2023, 3:56 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.