ETV Bharat / sports

సిడ్నీలో భారత్ గట్టెక్కేనా- ఛేజింగ్ రికార్డులు మాత్రం ఆసీస్ వైపే! - CHASINGS SYDNEY CRICKET GROUND

ఐదో టెస్టులో బౌలర్ల హవా- సిడ్నీలో అత్యధిక ఛేజింగ్ ఎంతంటే?

Sydney Cricket Ground
Sydney Cricket Ground (Source : Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Jan 4, 2025, 7:49 PM IST

Highest Chasings Sydney Cricket Ground : బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో ఆఖరి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రెండు రోజుల్లోనే మ్యాచ్‌ చాలా మలుపులు తిరిగింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG) పేసర్లకు సహకరిస్తుండడం వల్ల బ్యాటర్లు పరుగులు చేయడానికి కష్టపడుతున్నారు. మ్యాచ్​లో రెండు రోజుల్లోనే 26 వికెట్లు నేలకూలాయి. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 141/6తో నిలిచింది.

క్రీజులో జడేజా (8 పరుగులు), వాషింగ్టన్‌ సుందర్‌ (6 పరుగులు) ఉన్నారు. ప్రస్తుతం భారత్ 145 పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. నాలుగు వికెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ క్రమంలో భారత్ మరో 120- 150 పరుగులు చేస్తే మ్యాచ్​లో విజయావకాశాలు మెరుగ్గా ఉండే ఛాన్స్ ఉంది. మరి సిడ్నీ గ్రౌండ్​లో ఇప్పటి వరకు టెస్టు మ్యాచ్​లో అత్యధిక ఛేజింగ్​ ఎంతో మీకు తెలుసా?

రికార్డులు ఆసీస్​ వైపే!
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్​లో టెస్టు మ్యాచ్​లో అత్యధిక పరుగులు ఛేజ్‌ చేసిన రికార్డు ఆస్ట్రేలియా పేరిటే ఉంది. 2006లో సౌతాఫ్రికా నిర్దేశించిన 287 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఛేదించి విజయం సాధించింది. ఇదే సిడ్నీ టెస్టులో ఇప్పటివరకు ఉన్న టాప్ ఛేజింగ్. అంతే కాదు ఈ గ్రౌండ్​లో ఛేదించిన టాప్‌ 5 అత్యధిక టార్గెట్​లు కూడా ఆసీస్​వే కావడం విశేషం. SCGలో ఆసీస్​ ఆరుసార్లు 200+ లక్ష్యాన్ని ఛేజ్ చేసి హాట్ ఫేవరెట్​గా కనిపిస్తోంది.

సిడ్నీలో టాప్‌ 5 రన్-ఛేజ్‌లు ఇవే

విజేత ప్రత్యర్థి స్కోర్
ఆస్ట్రేలియా సౌతాఫ్రికా287/2
ఆస్ట్రేలియా ఇంగ్లాండ్276/4
ఆస్ట్రేలియా ఇంగ్లాండ్275/8
ఆస్ట్రేలియా న్యూజిలాండ్260/6
ఆస్ట్రేలియా ఇంగ్లాండ్219/4

రఫ్పాడించిన రిషభ్
రెండో ఇన్నింగ్స్​లో టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ రిషభ్ పంత్ రెచ్చిపోయాడు. ధనాధన్ ఇన్నింగ్స్​తో అలరించాడు. కేవలం 33 బంతుల్లో 61 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఏకంగా ఆరు ఫోర్లు, నాలుగు సిక్సులు బాదాడు. వేగంగా ఆడే క్రమంలోనే కమిన్స్​ బౌలింగ్​లో ఔటయ్యాడు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే, తొలి ఇన్నింగ్స్​లో భారత్ 185 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బౌలర్లు చెలరేగడం వల్ల ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్​లో 181 పరుగులకే పరిమితమైంది. దీంతో మొదటి ఇన్నింగ్స్​లో భారత్​కు 4 పరుగుల అతి స్వల్ప ఆధిక్యం లభించింది.

33 బంతుల్లో ఫాస్టెస్ట్ 50 - తన రికార్డునే బ్రేక్​ చేసిన పంత్​!

మెల్​బోర్న్​లో హైయ్యెస్ట్ ఛేజింగ్స్- 96ఏళ్ల రికార్డ్​ను టీమ్​ఇండియా బ్రేక్ చేయనుందా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.