ETV Bharat / state

సంక్రాంతికి ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు - TGSRTC BUS FOR SANKRANTI

సంక్రాంతికి తెలంగాణలో 6 వేలకు పైగా బస్సులు నడపనున్న తెలంగాణ ఆర్టీసీ - ప్రత్యేక బస్సుల్లో మాత్రం 50 శాతం అదనపు ఛార్జీలు

SANKRANTI FESTIVAL RTC BUSSES
RANGAREDDY RTC REGIONAL MANAGER (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 4, 2025, 7:39 PM IST

TGSRTC Buses for Sankati Festival : సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారి కోసం టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణికులకు సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు 6,432 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. అందులో 557 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. మహాలక్ష్మీ పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లెవెలుగు, ఎక్స్​ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్​ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం అమల్లో ఉంటుందని తెలంగాణ ఆర్టీసీ స్పష్టం చేసింది. ప్రత్యేక బస్సుల్లో మాత్రం 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. సంక్రాంతికి ప్రత్యేక బస్సుల ఏర్పాట్లపై రంగారెడ్డి రీజీనల్ మేనేజర్ శ్రీలత ఈటీవీ భారత్​కు వివరించారు.

సంక్రాంతికి ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు (ETV Bharat)

సంక్రాంతి పండుగ సందర్భంగా 6500ల బస్సులను నడిపేందుకు ప్రయత్నం చేస్తున్నాం. జనవరి 7 నుంచి 13 వరకూ వీటిని నడుపుతాం. ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, అమలాపురం, ఒంగోలు, కందుకూరుకు డిమాండ్​ బాగా ఉంది. అందువల్ల మొత్తంగా 400ల బస్సులను నడిపేందుకు ప్రణాళికలు వేశాం- శ్రీలత, రీజీనల్​ మేనేజర్​ రంగారెడ్డి

మహిళలకు సౌకర్యంగా : పర్యావరణహితమైన ఎలక్ట్రిక్​ బస్సులు నడపడానికి ప్రస్తుతం కరీంనగర్​, నిజామాబాద్​ నుంచి ఏర్పాట్లు పూర్తయినట్లు వెల్లడించారు. హైదరాబాద్​లో కూడా అందుబాటులో ఉన్నట్లు ఆర్​ఎం శ్రీలత తెలిపారు. మహాలక్ష్మీ పథకం వల్ల రద్దీ పెరిగినా దానికీ అనుగుణంగా అదనపు బస్సులను ఏర్పాటు చేసుకుని సిద్ధంగా ఉన్నాయని, మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నామని ఆమె తెలిపారు. రోజు వారీగా నడిపే బస్సుల్లో అదనపు ఛార్జీలు ఏమీ ఉండవని స్పష్టం చేశారు. కానీ పండుగ సందర్భంగా నడిపే అదనపు సర్వీసు బస్సులకు మాత్రం 50 శాతం అదనంగా ఛార్జీలు ఉంటాయని తెలిపారు.

సంక్రాంతికి 6,432 ప్రత్యేక బస్సులు - ఆ తేదీల్లో నడపనున్నట్లు టీజీఎస్ ​ఆర్టీసీ వెల్లడి

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి ఆర్టీసీ గుడ్​న్యూస్ - 7వ తేదీ నుంచి ప్రత్యేక బస్సులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.