గర్భ నిరోధక మాత్రలు వాడితే బీపీ పెరుగుతుందా? సమస్యకు పరిష్కారమేంటి? - గర్భనిరోధక మాత్రలు ఎలా ఉపయోగించాలి
🎬 Watch Now: Feature Video
Birth Control Pills Increase Blood Pressure : కొంత మంది పెళ్లి అయిన వెంటనే పిల్లలు వద్దు అనుకుంటారు. అలాంటి వారు అనుకోకుండా గర్భం ధరించకుండా ఉండేందుకు గర్భనిరోధక మాత్రలు వాడుతారు. మరికొందరు మొదటి సంతానానికి, రెండో ప్రసవానికి మధ్య కొన్నేళ్లు వ్యవధి కావాలనుకుంటారు. వారు కూడా ఆ మాత్రలను ఉపయోగిస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో వీటి వినియోగం ఎక్కువైంది. అనేక మంది మహిళలు వీటిని ఉపయోగిస్తున్నారు. చాలామంది మహిళల విషయంలో ఇవి సమర్థంగా పనిచేసినప్పటికీ.. కొంతమందిలో మాత్రం పలు దుష్ప్రభావాలు తలెత్తుతాయని చెబుతున్నారు నిపుణులు. అందుకే ఈ గర్భనిరోధక మాత్రలు వాడే క్రమంలో పలు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమంటున్నారు. ఈ మాత్రలు వాడడం వల్ల.. అధిక రక్తపోటు సమస్య తలెత్తవచ్చని కొందరు అపోహ పడుతున్నారు. అసలు మహిళలు ఈ మాత్రలు వాడవచ్చా? రక్తపోటు సమస్య ఇదివరకే ఉంటే ఎక్కువవుతుందా? అలాంటప్పుడు ఏం చేయాలి? వీటిన్నంటికి సమాధానాల కోసం ఈ వీడియో చూసేయండి.