బైకర్లను టార్గెట్ చేసిన గజరాజు.. లారీ డ్రైవర్ వల్ల లక్కీగా.. - తమిళనాడు
🎬 Watch Now: Feature Video
అడవి ఏనుగు నుంచి ఇద్దరు బైకర్లు.. త్రుటిలో తప్పించుకున్నారు. ప్రాణాలతో బతికి బయటపడ్డారు. ఈ ఘటన తమిళనాడులోని నీలగిరి ముదుమలై ప్రాంతంలో జరిగింది. గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే?
కేరళకు చెందిన ఇద్దరు వ్యక్తులు.. ఓ బైక్‌పై ముదుమలై వన్యప్రాణుల అభయారణ్యానికి రైడ్‌కు వెళ్లారు. చూట్టూ ఉన్న ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. ఆ సమయంలో ఎదురుగా ఓ అడవి ఏనుగు పరిగెత్తుకుంటూ వచ్చింది. అప్రమత్తమైన ఇద్దరు బైకర్లు.. తమ ముందు వెళ్తున్న ఉన్న లారీ పక్కకు చేరారు. అది గమనించిన గజరాజు.. వారిపై వైపు వెళ్లింది. అప్పుడే చాకచక్యంగా వ్యవహరించిన లారీ డ్రైవర్.. వాహనాన్ని ఆపి డోర్ తెరిచి వారిద్దరికి లోపలకు రమ్మన్నాడు. వెంటనే ఇద్దరు వ్యక్తులు లారీ ఎక్కేశారు. ఆ తర్వాత లారీ దగ్గరకు వచ్చిన ఏనుగు.. కాసేపు అక్కడ ఉండి వెళ్లిపోయింది. ఈ మొత్తం ఘటనను అటువైపు కారులో వెళ్తున్న వారు వీడియో తీసి సోషల్‌మీడియాలో షేర్ చేశారు.