సీఎం రేవంత్‌కు అఖండ ఆశీస్సులు - మీ మార్క్ పాలనతో తెలంగాణకు శ్రీరామరక్ష - సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపిన బాలకృష్ణ
🎬 Watch Now: Feature Video
Published : Dec 6, 2023, 9:32 AM IST
|Updated : Dec 6, 2023, 9:41 AM IST
Balakrishna Congratulations to Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఎనుముల రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)కి ఏపీలోని హిందూపూర్ టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ ( Balakrishna ) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజా సేవ పరమావధిగా రాజకీయాల్లో అంచెలంచెలుగా రేవంత్‌రెడ్డి ఎదిగారని కొనియాడారు. తెలంగాణ ప్రజలు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వారి ఆకాంక్షను నెరవేర్చాలన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడపాలని ఆయన కోరారు.
Balakrishna Comments Telangana New CM : ముఖ్యమంత్రిగా "మీ పాలన మార్క్‌తో తెలంగాణ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేయాలని" ఆకాంక్షిస్తూ నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. అయితే రేవంత్ రెడ్డికి, బాలకృష్ణకి మధ్య చాలా ఏళ్ల నుంచి మంచి అనుబంధం ఉంది. గతంలో రేవంత్ రెడ్డి తెలుగు దేశం పార్టీలో ఉన్న సమయంలో వీరిద్దరు తరచూ కలుసుకునేవారు. చంద్రబాబుకి, రేవంత్ రెడ్డి సన్నిహితంగా ఉండటంతో అనుబంధం బాలయ్యతోను ఏర్పడింది. కాంగ్రెస్ అధిష్టానం సీఎంగా రేవంత్ ఎంపిక చేయడంతో వెంటనే ఆయన తన అభినందనలు చెప్పారు.