మిత్రుడ్ని చూసిన ఆనందంలో కొంగ డ్యాన్స్.. 'జూ' నుంచి బయటకు వచ్చే యత్నం - arif saras news
🎬 Watch Now: Feature Video
Arif Saras news : ప్రాణాలను కాపాడి, ఎన్నో ఏళ్లు సంరక్షించిన వ్యక్తి తనను చూసేందుకు 'జూ' పార్క్‌కు రాగానే ఆనందంతో డ్యాన్స్ చేసింది ఓ కొంగ. ఆ వ్యక్తి తాను ధరించిన మాస్క్ తీయగానే.. అతడిని గుర్తుపట్టిన కొంగ ప్రేమగా అరుస్తూ.. దగ్గరకు వెళ్లడం 'జూ'కు వచ్చిన సందర్శకులను ఆకర్శించింది.
ఉత్తర్‌ప్రదేశ్ అమేఠీకి చెందిన ఆరిఫ్‌కు, ఓ సారస్ కొంగకు మధ్య ఉన్న స్నేహం గురించి ప్రపంచానికి తెలిసిందే. రాష్ట్ర మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ సైతం వీరి స్నేహం గురించి తెలుసుకొని.. గతంలో ఆరిఫ్‌ను కలిశారు. అయితే కొన్ని నెలల కింద యోగి ప్రభుత్వం.. నిబంధనల ప్రకారం కొంగను, ఆరిఫ్ నుంచి వేరు చేసి కాన్పుర్ 'జూ'లో బంధించింది. చాలా రోజులకు ఆరిఫ్.. కొంగను చూడాలనిపించి తనను ఎవరూ గుర్తుపట్టకుండా మాస్క్ ధరించి గురువారం కాన్పుర్ 'జూ'కు వెళ్లాడు. కొంగ దగ్గరకు చేరుకున్నాక ఆరిఫ్.. తన మాస్క్‌ను తీసివేశాడు. వెంటనే ఆరిఫ్‌ను గుర్తుపట్టిన కొంగ.. పట్టలేని సంతోషంతో ప్రేమగా అరుస్తూ.. డ్యాన్స్ చేసింది. తనను బంధించిన బోనులోంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించింది. ఆరిఫ్ తన వేళ్లను బోను దగ్గర పెట్టగానే.. కొంగ ప్రేమగా కొరికింది.
ఈ అందమైన సన్నివేశాన్ని మొత్తం ఆరిఫ్ తన ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నాడు. కాగా కొంగను 'జూ' నిర్వాహకులు సరిగ్గా చూసుకోవడం లేదంటూ ఆరోపించాడు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొంగను జూ లోంచి విడిపించాలని కోరాడు. వైరల్‌గా మారిన వీడియోను చూసిన 'జూ' నిర్వాహకులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆరిఫ్ - సారస్ కొంగ స్నేహం గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.