15 అడుగులు గాల్లోకి లేచిన భారీ క్రేన్.. దుకాణాలు, ట్రాక్టర్ ధ్వంసం - క్రేన్ ప్రమాదం
🎬 Watch Now: Feature Video
జనరేటర్‌ను కిందకు దించేందుకు వచ్చిన భారీ క్రేన్ బోల్తా పడింది. ఈ సందర్భంగా క్రేన్.. సుమారు 15 అడుగులు గాల్లోకి లేచింది. ఈ ఘటన పంజాబ్‌లోని లుధియానాలో జరిగింది. ఆ జనరేటర్ కింద పడడం వల్ల ట్రాక్టర్ సహా సమీపంలోని దుకాణాలన్నీ ధ్వంసమయ్యాయి.
ఇదీ జరిగింది
గోశాల రోడ్డులోని ఓ దుకాణంలో బాహుబలి జనరేటర్‌ను అమర్చేందుకు ఓ భారీ క్రేన్ వచ్చింది. ఈ క్రమంలోనే ట్రాక్టర్లో ఉన్న జనరేటర్‌ను.. కిందకు దించుతుండగా అదుపుతప్పి క్రేన్ బోల్తా పడింది. దీంతో క్రేన్ 15 అడుగుల ఎత్తులోకి పైకి లేచింది.
మరోవైపు, జనరేటర్ పడడం వల్ల ట్రాక్టర్ పూర్తిగా ధ్వంసమైంది. క్రేన్ బోల్తా పడడం వల్ల సమీపంలోని అనేక దుకాణాలు, భవనాలు దెబ్బతిన్నాయి. పలువురికి గాయాలు కాగా.. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. వీధి చిన్నగా ఉండడమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై అక్కడే ఉన్న క్రేన్ యజమానిని అడగగా.. ఆయన స్పందించలేదు. ఈ సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. సహాయక చర్యలు చేపట్టారు. బోల్తా పడిన క్రేన్‌ను సరిచేసి రహదారిని పునరుద్ధరించారు.