ఒంటికి నిప్పు అంటించుకుని పరుగు.. లారీకి పోలీసులు ఫైన్ వేశారని... - సేలం లారీ డ్రైవర్
🎬 Watch Now: Feature Video

LORRY DRIVER SET FIRE: పోలీసుల ఎదుటే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు ఓ లారీ డ్రైవర్. ఈ ఘటన తమిళనాడులోని సేలంలో జరిగింది. మద్యం తాగి వాహనాన్ని నడుపుతూ పట్టుబడిన సంతోష్‌పై కేసు నమోదు చేసి.. లారీని జప్తు చేశారు పోలీసులు. రూ.10 వేలు జరిమానా విధించారు. వాహనాన్ని వదిలి వెళ్లేందుకు ఇష్టపడని సంతోష్ సమీపంలోని బంక్‌కు వెళ్లి పెట్రోల్ కొని పోలీసుల ఎదుటే నిప్పంటించుకున్నాడు. అక్కడి నుంచి పరుగులు తీశాడు. దీంతో పోలీసులు వెంటనే మంటలు ఆర్పి, సంతోష్‌ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీసీ టీవీ కెమెరాలో రికార్డయిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST