A Boy Stuck in Apartment Lift Die : హైదరాబాద్‌లోని ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కొని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆరేళ్ల బాలుడు ఇవాళ మృతి చెందాడు. ఈ విషయాన్ని నిలోఫర్ ఆసుపత్రి సూపరిండెంట్ రవి కుమార్ తెలిపారు. మాసబ్‌ట్యాంక్ శాంతినగర్‌లోని అపార్ట్‌మెంట్‌లో ఈ ప్రమాదం జరిగింది. దీంతో వెంటనే అపార్ట్‌మెంట్‌వాసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలుడిని బయటకు తీశారు. సాంకేతిక లోపం కారణంగానే లిఫ్ట్ మధ్యలో నిలిచిపోయిందని అధికారులు చెబుతున్నారు.
"విషయం తెలియగానే మేము వచ్చేసరికి లిఫ్టు దగ్గర ఆ పిల్లవాడి కుటుంబ సభ్యులు ఉన్నారు. వెంటనే స్థానిక పోలీసులు, డీఆర్ఎఫ్, 108 వాహనం, నిలోఫర్ వైద్యులను పిలిపించడం జరిగింది. బాలుడు ఫస్ట్‌ఫ్లోర్‌లో గోడకు లిఫ్టుకు మధ్యలో ఇరుక్కుపోయి గాయాలయ్యాయి. బాడీ లోపల ఆర్గాన్స్ ఏమైనా దెబ్బతిన్నాయా లేదా అనేది డాక్టర్లు చూస్తున్నారు. ఎందుకంటే లిఫ్టు అనేది చాలా వెయిట్ ఉంటుంది. బాలుడు ఇరుక్కుపోవడం వల్ల అంత వెయిట్ ఉన్న లిఫ్టు ఆగిపోయింది. ఆ పిల్లవాడి పై చాలా ఒత్తిడి పడి ఉంటుందని భావిస్తున్నాం. డాక్టర్లు బాగానే పిల్లవాడి పట్ల శ్రద్ధ చూపిస్తున్నారు. ఏం కాకూడదని కోరుకుంటున్నాం"-సంజయ్, నాంపల్లి ఏసీపీ
పొట్ట, వెన్నులో తీవ్ర గాయాలవడంతో సర్జరీ : ప్రాథమిక చికిత్స అందించడం కోసం బాలుడ్ని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. గ్రౌండ్‌ఫ్లోర్, ఫస్ట్‌ఫ్లోర్ మధ్య బాలుడు ఇరుక్కుపోయినట్లు తెలిపారు. దీంతో పొట్ట, వెన్నులో తీవ్రంగా గాయాలయ్యాయన్నారు. లిఫ్ట్, గోడకు మధ్యన బాలుడు చిక్కుకోవడంతో అతడిపై తీవ్ర ఒత్తిడి పడినట్లు వైద్యులు పేర్కొన్నారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని బాలుడికి సర్జరీ చేస్తున్నట్లు నిలోఫర్ సూపరింటెండెంట్ రవికుమార్ వెల్లడించారు. సర్జరీ తర్వాతనే ఏ విషయమైనా చెప్పగలమని తెలిపారు.
బాలుడి పరిస్థితి విషమం : బాలుడి పరిస్థితి విషమంగా ఉందని నిలోఫర్ సూపరింటెండెంట్ తెలిపారు. బాలుడి శరీర లోపలి భాగాలు నలిగిపోయి దెబ్బతిన్నాయని వైద్యులు ఈ మేరకు వెల్లడించారు. లిఫ్టులో 2గంటలకు పైగా ఇరుక్కుని పోయి ఉండటం కారణంగా ఆక్సిజన్ అందక, రక్తప్రసరణ జరగకపోవడంతో అవయవాలు దెబ్బతిన్నాయని నిలోఫర్ వైద్యులు పేర్కొన్నారు. చికిత్స చేసినప్పటికీ బాలుడి పరిస్థితి విషమంగా ఉందని నిలోఫర్ సూపరింటెండెంట్ తెలిపారు. ప్రస్తుతం బాలుడికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఇవాళ వెంటిలేటర్‌పై బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.
లిఫ్ట్ ఎక్కి ఇరుక్కుపోయాడు - గోడకు రంధ్రం చేసి బయటకు తీశారు
Elevator Fell: పైఅంతస్తు నుంచి తెగిపడ్డ లిఫ్టు.. ముగ్గురికి తీవ్రగాయాలు