ETV Bharat / spiritual

ఈ శివరాత్రికి "మహా ఆదియోగి" దర్శనం - తెలుగు భక్తులు ఇలా వెళ్లొచ్చు! - ADI YOGI STATUE TOUR

- మహాశివరాత్రి వేళ అద్వితీయ దర్శనం - రైలు, రోడ్డు, విమాన మార్గాల్లో ప్రయాణం

Adi yogi statue Tour in Coimbatore
Adi yogi statue Tour in Coimbatore (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 21, 2025, 4:43 PM IST

Adi yogi statue Tour in Coimbatore : మహాశివుడి రూపమే అత్యద్భుతంగా ఉంటుంది. దర్శించుకున్న భక్తులు తన్మయత్వానికి లోనవుతారు. అలాంటిది, పరమ పవిత్రమైన శివరాత్రివేళ అత్యంత అపురూపమైన "ఆదియోగి" విగ్రహాన్ని దర్శించుకుంటే ఆ క్షణాలు జీవితాంతం కళ్ల ముందు కదలాడుతాయి. అందుకే, ఏ మాత్రం అవకాశం ఉన్నా ఈ శివరాత్రికి ప్లాన్ చేయండి. ఎలా వెళ్లాలో మేం దారి చూపిస్తాం.

ఈ మహా ఆదియోగి విగ్రహం తమిళనాడులోని కోయంబత్తూర్​లో ఉంది. ఎత్తు ఏకంగా 112 అడుగులు. రూపం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ మహాశివుడి విగ్రహాన్ని వారంలో ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శించుకోవచ్చు. రాత్రివేళ ఈ విగ్రహం మీద ప్రసరించే లైటింగ్​ షో ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ విగ్రహాన్ని దర్శించుకోవడానికి ఎలాంటి డబ్బులూ చెల్లించాల్సిన అవసరం లేదు.

శివరాత్రి కోలాహలం :

మహాశివరాత్రి వేళ శివయ్య సమక్షంలో జాగారం చేస్తేనే భక్తులకు సంతృప్తి. అందుకే ఈ పర్వదినం వేళ ఆదియోగి విగ్రహ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతుంది. సామాన్య భక్తుల నుంచి ప్రముఖుల వరకు అక్కడ బారులు తీరుతారు. రాత్రంతా శివనామ స్మరణలో తేలియాడుతారు.

సందర్శించదగిన ఇతర ప్రదేశాలు :

ఆదియోగి విగ్రహం మాత్రమే కాకుండా, సమీపంలో మరికొన్ని దర్శనీయ ప్రాంతాలు ఉన్నాయి. అందులో ఒకటి ధ్యానలింగ ఆలయం. కోయంబత్తూరులోని ఈ టెంపుల్​లో పొడవైన శివలింగం ఉంటుంది. ఆదియోగి విగ్రహాన్ని దర్శించుకునేవారు తప్పకుండా ధ్యానలింగాన్ని సందర్శిస్తారు.

సూర్య కుండ్, చంద్ర కుండ్ :

సమీపంలో సూర్యకుండ్ ఇంకా చంద్రకుండ్​ ఉన్నాయి. ఆదియోగి విగ్రహాన్ని సందర్శించుకోవడానికి ముందే భక్తులు ఇక్కడకు వెళ్లి స్నానాలు చేస్తారు. ఈ కుండ్‌లు ఎంతో నీట్​గా ఉంటాయి. చూడటానికి చాలా ఆహ్లాదంగా ఉంటాయి.

వెల్లియంగిరి పర్వతాలు :

టూరిస్ట్​ ప్లేస్​లు కూడా ఇక్కడ ఉన్నాయి. ట్రెక్కింగ్ చేయాలని కోరుకునేవారికి వెల్లియంగిరి పర్వతాలు సూపర్​ ఆప్షన్. ఈ కొండలపై నుండి కనిపించే దృశ్యాలు ఎంతో రమణీయంగా ఉంటాయి. ప్రకృతిని ఇష్టపడే వారు తప్పకుండా వెళ్లి వస్తారు.

వైదేహి జలపాతం :

జలపాతాలను చూడాలనే వారి కోరిక కూడా తీరుతుంది. వైదేహి జలపాతం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ కూడా ట్రెక్కింగ్​ ఉంటుంది. ఇది కూడా మెమరబుల్​ ప్లేస్​గా మిగిలిపోతుంది.

ఆదియోగి చెంతకు ఇలా :

  • తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లాలనుకునే భక్తులు రోడ్డు, రైలు, వాయు మార్గాల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు.
  • రైలు ద్వారా వెళ్లాలనుకునేవారు ముందుగా కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ చేరుకోవాలి. అక్కడి నుంచి ఆదియోగి విగ్రహం సుమారు 32 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
  • కోయంబత్తూరులోని గాంధీపురం బస్ స్టేషన్​ నుంచి ఆదియోగి విగ్రహం వద్దకు ప్రతి గంటకూ ఒక బస్సు వెళ్తుంది. అక్కడ దిగి మరో ఐదారు నిమిషాల జర్నీ చేయాల్సి ఉంటుంది.
  • వ్యక్తిగత వాహనం ద్వారా కూడా నేరుగా ఆదియోగి వద్దకు చేరుకోవచ్చు.
  • ఫ్లైట్​లో వెళ్లాలని అనుకునేవారు, కోయంబత్తూర్ విమానాశ్రయం చేరుకోవాలి. అక్కడి నుంచి 33 కిలోమీటర్ల దూరంలో విగ్రహం ఉంటుంది. ఇక్కడ్నుంచి పలు రకాల రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి :

శివరాత్రి వేళ శ్రీశైల మల్లికార్జునుడిని దర్శించుకుంటారా? - తక్కువ ధరకే IRCTC సూపర్​ ప్యాకేజీ - ఈ ప్రదేశాలూ చూడొచ్చు!

శివరాత్రి ఉపవాసం చేస్తున్నారా? - ఈ జాగ్రత్తలు పాటిస్తే నీరసం అస్సలే రాదు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.