Live Video: బావిలో పడ్డ చిరుత.. మంచం సాయంతో పైకి.. - leopard stuck in well
🎬 Watch Now: Feature Video

Leopard fell into well: బావిలో పడి, బయటకు ఎలా రావాలో తెలియక విలవిల్లాడుతున్న చిరుతను మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులు రక్షించారు. గురువారం దేవుల్గావ్ రాజా ఫారెస్ట్ రేంజ్ ఖలియాల్ గ్రామంలోని వ్యవసాయ బావిలో ఓ చిరుత పడిపోయింది. బావిలోనే ఈదుతూ కంగారుగా తిరిగింది. ఓ గొట్టాన్ని పట్టుకుని పైకి వచ్చేందుకు విఫలయత్నం చేసింది. స్థానికుల సమాచారంతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. నులక మంచాన్ని బావిలోకి వేసి, దానిపైకి చిరుత ఎక్కేలా చేశారు. తర్వాత దానిని బోనులోకి పంపించారు. వెంటనే బోను మూసేసి, పైకి తెచ్చి.. చిరుతను సమీపంలోని అడవిలో విడిచిపెట్టారు.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST