ఆగని కార్చిచ్చు- లక్షల ఎకరాలు దగ్ధం
🎬 Watch Now: Feature Video
అమెరికా కాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభత్సం కొనసాగుతోంది. నేవాడా సరిహద్దులో పదిలక్షల ఎకరాల అటవీ భూమి.. మంటల ధాటికి దగ్ధమైంది. వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది.. యుద్ధవిమానాల ద్వారా మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటల తీవ్రత దృష్ట్యా.. ఫ్రెంచ్మ్యాన్ సరస్సు చుట్టూ 518 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న నివాసితులను ఖాళీ చేయాల్సిందిగా అధికారులు ఆదేశించారు. ఓ అగ్నిపర్వతం నుంచి వెలువడిన లావా కారణంగా ఈ మంటలు వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది. మంటల కారణంగా వివిధ ప్రాంతాల్లోని వన్యప్రాణులు అగ్నికి ఆహుతి అవుతున్నాయి.