ఒళ్లు జలదరించే విన్యాసాలతో 'డౌన్ హిల్' రేస్ - డౌన్ హిల్ రేసు
🎬 Watch Now: Feature Video
ఒళ్లు గగుర్పొడిచే రేసులో మొదటి స్థానంలో ఉంటుంది ఈ డౌన్ హిల్ రేసు. ఎత్తైన పర్వతాల మీదుగా దూకుతూ ఈ రేసు చేయడం మామూలు విషయం కాదు. పొరపాటు జరిగితే ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి. అందుకే ఈ రేస్‌లో పాల్గొనాలంటేనే చాలా మంది వణికిపోతారు. అయితే ఈ డౌన్‌హిల్ రేస్‌ను ప్రముఖంగా ఆస్ట్రియాలోని హానెన్క్యామ్ పర్వతా ప్రాంతంలో ప్రతి ఏటా నిర్వహిస్తారు. 81వ హానెన్క్యామ్ రేస్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ నెల 24 వరకు జరగనుంది. ప్యారాచ్యూట్లు వేసుకుని రెడ్‌బుల్ స్కైడైవ్ టీం ఈ రేసులో పాల్గొంది. పర్వతంపై నుంచి దూకుతూ వేగంగా.. మంచు మీద అతి కొద్ది ఎత్తులో ఈ రేస్‌ను పూర్తిచేసింది.