అదరహో.. ప్రపంచంలోనే అతిపెద్ద 'క్రిస్మస్ మార్కెట్' - christmas celebrations
🎬 Watch Now: Feature Video
ఆస్ట్రియాలో క్రిస్మస్ సంబరాలు ప్రారంభమయ్యాయి. రాజధాని వియన్నా టౌన్‌హాల్ ముందు భారీ 'క్రిస్మస్ ట్రీ' ను ఆవిష్కరించారు నగర మేయర్ మైఖేల్ లుడ్వింగ్. సంప్రదాయ ఆస్ట్రియా బ్యాండ్ బాజాలతో అతిపెద్ద క్రిస్మస్ మార్కెట్‌ను అధికారికంగా ప్రారంభించారు. దాదాపు 150 షాపులు ఒకే చోట ఉండే ఈ ప్రాంతం ప్రపంచంలోనే అతిపెద్ద క్రిస్మస్ మార్కెట్లలో ఒకటి. 32 మీటర్ల ఎత్తైన ఈ క్రిస్మస్ ట్రీ వియన్నాలో ఇప్పటివరకు ఏర్పాటు చేసిన అతిపెద్ద క్రిస్మస్ ట్రీ కావడం విశేషం.