రూబిక్స్ క్యూబ్ పోటీల్లో వీళ్లకు తిరుగేలేదు! - పురుషుల విభాగంలో అమెరికాకు చెందిన టీనేజర్ మాక్స్ పార్క్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5106905-332-5106905-1574115172101.jpg)
రూబిక్స్ క్యూబ్‌లోని చిక్కుముడులను విప్పడం ఎంతో కష్టం. చాలా మంది కొంతసేపు ప్రయత్నంచి చేతులెత్తేస్తారు. మరికొందరు ఎంతో సేపు ప్రయత్నించి విజయం సాధిస్తారు. ఇంకొందరు చిటికెలో రూబిక్స్ క్యూబ్‌లోని రంగులను ఒక్కచోట చేర్చగలరు. అలాంటి వారు ఒక్కటై రష్యా రాజధాని మాస్కోలో జరిగిన రెడ్‌బుల్ రూబిక్స్ క్యూబ్ ప్రపంచ కప్‌లో పాల్గొన్నారు. తమ చేతులతో క్యూబ్‌ను గిర్రుగిర్రున తిప్పేశారు. ఈ పోటీ ఫైనల్లో పురుషుల విభాగంలో అమెరికాకు చెందిన మాక్స్ పార్క్ 3x3 ఫాస్టెస్ట్ హ్యాండ్ ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నాడు. మహిళల విభాగంలో ఫ్రాన్స్‌కు చెందిన జూలియట్ సెబాస్టియన్ టైటిల్ కైవసం చేసుకుంది.
TAGGED:
RB Rubik's Cube World Cup