ETV Bharat / sports

గిల్ ఆల్​టైమ్ రికార్డ్- ప్రపంచంలోనే తొలి బ్యాటర్​గా! - INDIA VS ENGLAND 2025

ఇంగ్లాండ్​తో మూడో వన్డే- సెంచరీతో చెలరేగిన గిల్- ఖాతాలో పలు రికార్డులు

India vs England
India vs England (Source : Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Feb 12, 2025, 5:02 PM IST

Shubman Gill Records : టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ శుభ్​మన్ గిల్ ఇంగ్లాండ్​తో మూడో వన్డేలో శతకంతో కదం తొక్కాడు. తొలి ఓవర్ నుంచే అద్భుతమైన ఆటతో అలరించిన గిల్ 102 బంతుల్లో 112 పరుగులు చేశాడు. ఇందులో 14 ఫోర్లు, 3 సిక్స్​లు ఉన్నాయి. కాగా, గిల్​కు వన్డేల్లో ఇది 7వ సెంచరీ. ఈ క్రమంలో గిల్ పలు అరుదైన ఘనతలు తన ఖాతాలో వేసుకున్నాడు. అవేంటంటే?

భారత్​లో తొలి బ్యాటర్​గా : గిల్​ కెరీర్​లో ఇది తనకు 50వ వన్డే మ్యాచ్​. భారత్ తరఫున 50వ వన్డేలో సెంచరీ సాధించిన తొలి బ్యాటర్​గా రికార్డు సృష్టించాడు.గిల్ కన్నా ముందు ఏ భారత ఆటగాడు కూడా 50వ మ్యాచ్​లో శతకం బాదలేదు.

వరల్డ్ రికార్డ్ : 50 మ్యాచ్​ల్లోనే గిల్ 2500 పరుగుల మార్క్​ దాటాడు. ఈ క్రమంలో వన్డేల్లో అత్యధిక వేగంగా ఈ మైలురాయి అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. ఇదివరకు ఈ రికార్డ్ సౌతాఫ్రికా బ్యాటర్ హషీమ్ ఆమ్లా (51 మ్యాచ్​ల్లో) పేరిట ఉంది. తాజా మ్యాచ్​తో గిల్ ఆ రికార్డ్​ బద్దలు కొట్టాడు. గిల్ వన్డేల్లో ఇప్పటివరకు 2587 పరుగులు చేశాడు

ఒకే వేదికగా : అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ స్టేడియంలో గిల్ అన్ని ఫార్మాట్ (టీ20, వన్డే, టెస్టు, ఐపీఎల్)ల్లో సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలో ఒకే వేదికపై అన్ని ఫార్మాట్లలో సెంచరీ బాదిన భారత తొలి బ్యాటర్​గా రికార్డ్ సృష్టించాడు. అంతర్జాతీయ, ఐపీఎల్​ (3) కలిపి గిల్ నరేంద్ర మోదీ స్టేడియంలో 6 శతకాలు నమోదు చేశాడు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఒకే స్టేడియంలో అన్ని ఫార్మాట్లలో సెంచరీ సాధించిన ఐదో ఆటగాడిగా నిలిచాడు.

గ్రీన్ బ్యాండ్స్ ధరించిన ఆటగాళ్లు
అవయవ దానంపై అవగాహన కల్పించేందుకు బీసీసీఐ ముందడుగు వేసింది. ఈ క్రమంలో మూడో వన్డేలో ఇంగ్లాండ్- టీమ్ఇండియా ప్లేయర్స్ గ్రీన్ ఆర్మ్ బ్యాండ్స్ ధరించి మైదానంలోకి దిగారు. బీసీసీఐ తలపెట్టిన 'డొనేట్ ఆర్గాన్స్, సేవ్ లైవ్స్'కు మద్దతుగా రెండు జట్లూ గ్రీన్ ఆర్మ్ బ్యాండ్​లు ధరించాయి.

గిల్, విరాట్, అయ్యర్ మెరుపులు- ఇంగ్లాండ్​కు భారీ టార్గెట్

ఇప్పుడు కూడా అదే ఆలోచనతో బరిలోకి దిగుతాం - మాకేం ఆందోళన లేదు! : గిల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.