పారిస్: హ్యాపీ బర్త్ డే టు 'ఈఫిల్ టవర్' - ఈఫిల్ టవర్
🎬 Watch Now: Feature Video
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రఖ్యాత కట్టడం ఈఫిల్ టవర్ 130వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం నిర్వహించిన లేజర్ షో కాంతుల్లో పురాతన కట్టడం మెరిసిపోయింది. సుమారు 1300 మంది చిన్నారులు ఈ వేడుకలను వీక్షించారు. 12 నిమిషాల పాటు సాగే లేజర్ షోను మరో రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు. ప్రతి ఏటా సుమారు 60 లక్షల మంది పర్యటకులు ఇక్కడికి వస్తారు. ఈ టవర్ నిర్మాణం 1889లో జరిగింది.
Last Updated : May 16, 2019, 8:24 AM IST