రష్యా విజయోత్సవ వేళ.. వీధులు వెలవెల - russia governament
🎬 Watch Now: Feature Video
కరోనా వ్యాప్తి నేపథ్యంలో తమ దేశ 75వ విజయోత్సవ వేడుకను నిలిపి వేసింది రష్యా ప్రభుత్వం. దీంతో సైనిక కవాతులతో, భారీ సంఖ్యలో ప్రజల ర్యాలీతో కనిపించాల్సిన వీధులన్నీ నిర్మానుషంగా కనిపిస్తున్నాయి. నగరంలో లాక్డౌన్ ఆంక్షలు విధించటం వల్ల రహదారులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో విజయం సాధించిన సందర్భంగా ఏటా పెద్ద ఎత్తున విజయోత్సవ వేడుకలు జరుపుకుంటారు రష్యా వాసులు. కానీ ఈ ఏడాది కరోనా ఉద్ధృతి కారణంగా వేడుకలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు రష్యా అధ్యక్షుడు పుతిన్.