వైద్య సిబ్బంది సేనలకు వందనం - కరోనా వీర వైద్యలకు సంఘీభావంగా సైనిక విన్యాసం
🎬 Watch Now: Feature Video
కరోనా కట్టడిలో ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బంది, అత్యవసర సేవల ఉద్యోగులకు అమెరికా సేనలు సెల్యూట్ చేశాయి. అమెరికా నావికాదళానికి చెందిన బ్లూఏంజిల్స్,వాయుసేనకు చెందిన థండర్‌బర్డ్స్ విమానాలు న్యూయార్క్ నగరంపై ఎగురుతూ వందనం సమర్పించాయి. తర్వాత ట్రెంటన్, న్యూజెర్సీ, ఫిలడెల్ఫియాలోనూ వైద్య సిబ్బందికి గౌరవ వందనం చేశాయి. వైద్య సిబ్బందిలో మనోస్థైర్యం నింపేందుకు వచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నట్లు నేవీకి చెందిన అధికారులు తెలిపారు. పైలెట్ల శిక్షణలో భాగంగా తప్పనిసరిగా చేయాల్సిన గగనతల ప్రయాణం కూడా ఈ సెల్యూట్‌తో కలిసి వచ్చినట్లు వెల్లడించారు.