ఆ ఊరిపై టన్నులకొద్దీ బూడిద వర్షం- బుల్డోజర్ల సాయంతో తొలగింపు - అగ్నిపర్వతం విస్ఫోటనం
🎬 Watch Now: Feature Video
La Palma Volcano Eruption: స్పెయిన్, లా పల్మాలో కంబర్‌వీజా అగ్నిపర్వతం పేలడం వల్ల చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన బూడిదతో నిండిపోయింది. అగ్నిపర్వతం పేలి 85 రోజులు కావస్తున్నా ఇంకా ఆ తీవ్రత తగ్గలేదు. రోడ్లు, ఇళ్లపై పేరుకుపోయిన బూడిదను తొలగించే ప్రక్రియను అధికారులు ఆదివారం ప్రారంభించారు. సెప్టెంబరు 19న జరిగిన విస్ఫోటంతో 2 వేలకుపైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. అగ్నిపర్వతం నుంచి వచ్చిన లావా సుమారు 2వేల ఎకరాలకుపైగా పంట భూమిని నాశనం చేసింది.