తుపాను బీభత్సం- బురదలో కూరుకుపోయిన గుర్రాలు!
🎬 Watch Now: Feature Video
అమెరికాలో తుపాను కారణంగా మూగ జీవాలు ఇక్కట్లు పడుతున్నాయి. ఉత్తర కాలిఫోర్నియాలో వరదల కారణంగా.. సలీనస్ ప్రాంతంలో బుధవారం రాత్రి గుర్రాల పాకను బురద ముంచెత్తింది. దాంతో రెండు గుర్రాలు అందులోనే చిక్కుకున్నాయి. సగం లోతుకి బురదలో కూరుకుపోయిన తల్లి, పిల్ల గుర్రాలు 18 గంటల పాటు అలాగే ఉండిపోయాయి. గురువారం ఉదయం యజమాని వీటిని గుర్తించి.. స్థానికుల సాయంతో బయటకు లాగారు. ప్రాథమిక చికిత్స పొందిన ఆ గుర్రాలు ప్రస్తుతం జంతు పరిరక్షకుల పర్యవేక్షణలో ఉన్నాయి. రెండు గుర్రాలు క్షేమంగానే ఉన్నట్టు పశువైద్యలు తెలిపారు.