మోదీ చెప్పినట్లే చేసిన పారిస్ వాసులు - మోదీ ఇలా చెప్పారు ఫ్రాన్స్ అలా చప్పట్లు కొట్టింది
🎬 Watch Now: Feature Video
ఫ్రాన్స్ ప్రజలు నిన్న పెద్ద ఎత్తున కిటికీలు, బాల్కనీల దగ్గర నిల్చొని చప్పట్లు కొట్టారు. కరోనా వైరస్‌కు భయపడకుండా పోరాటం చేస్తోన్న వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సహా అత్యవసర సేవలందిస్తున్న వారిని అభినందిస్తూ పారిస్ వాసులు ఇలా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నిన్న తన ప్రసంగంలో ఇదే విషయాన్ని ప్రస్తావించడం విశేషం. జనతా కర్ఫ్యూ అయిన మార్చి 22న సాయంత్రం 5 గంటల సమయంలో ఇంటి గుమ్మాలు, కిటికీలు, బాల్కనీల్లో నిలబడి ఐదు నిమిషాల పాటు చప్పట్లు, గంటలు కొడుతూ అత్యవసర సేవల సిబ్బంది కృషిని గుర్తు చేసుకోవాలని ప్రజలను కోరారు మోదీ.