చైనా ఆర్డర్.. ఆ జిల్లాలోని జనం అందరికీ కరోనా టెస్టులు! - చైనా బీజింగ్‌లో కొవిడ్ వ్యాప్తి
🎬 Watch Now: Feature Video

Covid Testing Beijing: చైనా రాజధాని బీజింగ్‌లో మరోసారి కరోనా విజృంభిస్తోంది. తాజాగా నగరంలో ఆరు కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నగరం దాటి ఎవరూ బయటకు వెళ్లొద్దని ఆదేశించారు. బీజింగ్ సరిహద్దు జిల్లా ఫెంగ్టాయ్లోనూ తాజాగా 25 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలోని 20 లక్షల మందికి వైరస్ నిర్ధరణ పరీక్షలు ప్రారంభించారు. ఈ క్రమంలో కొవిడ్ పరీక్షల కోసం ప్రజలు బారులు తీరారు. ఫిబ్రవరి 4న వింటర్ ఒలింపిక్స్ ప్రారంభంకానున్న నేపథ్యంలో అధికారులు పూర్తిస్థాయిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.