స్ప్రింగ్​ ఫెస్టివల్​ 'గాలా'.. ధగధగలాడుతున్న చైనా - చైనా న్యూ ఇయర్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 1, 2022, 8:58 AM IST

Updated : Feb 1, 2022, 9:08 AM IST

China Spring Festival: నూతన సంవత్సరాన్ని చైనా ఘనంగా ఆహ్వానించింది. టైగర్ సంవత్సరానికి చైనీయులు అంతా ఆహ్వానం పలికారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని వారం రోజులు పాటు చైనావ్యాప్తంగా స్ప్రింగ్ ఫెస్టివల్ జరగనుంది. ఈ సందర్భంగా దేశ ప్రజలు ఐక్యంగా ఉండాల్సిన ఆవశ్యకతపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సందేశమిచ్చారు. చైనా మీడియా గ్రూప్-సీఎంజీ నిర్వహించిన ప్రదర్శన కట్టిపడేసింది. చైనా ఆహార, వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలను మేళవిస్తూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో కళాకారులు చేసిన ప్రదర్శన కళ్లు తిప్పుకోనివ్వలేదు. ఈ ప్రదర్శనలో చైనా సాధించిన విజయాలకు పెద్దపీట వేశారు. చైనా అంతరిక్ష కేంద్రం టియాంగాంగ్‌లో ఉన్న ముగ్గురు వ్యోమగాములు వీడియో సందేశం ద్వారా తమ దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Last Updated : Feb 1, 2022, 9:08 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.