ETV Bharat / health

మూడో భోజనం అప్పుడు తింటే మీకు మూడినట్టే - షుగర్​ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువట! - DIABETES AND HIGH BLOOD PRESSURE

- రోజురోజుకూ పెరుగుతున్న డయాబెటిస్, బీపీ బాధితులు - ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అంటున్న నిపుణులు!

PRECAUTIONS FOR AVOID DIABETES
Diabetes and Blood Pressure Causes (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 26, 2025, 1:02 PM IST

Diabetes and Blood Pressure Causes : ప్రస్తుత రోజుల్లో మధుమేహం, అధిక రక్తపోటు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ జబ్బుల బారిన పడుతున్నారు. నగర, పట్టణ వాసులే కాదు, పల్లె జనం కూడా వీటి బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆరోగ్యంపై అవగాహన రాహిత్యంతోనే, ఈ ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారంటున్నారు నిపుణులు. కాబట్టి, తొలి నుంచే ఈ వ్యాధుల పట్ల అవగాహన కలిగి, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే డయాబెటిస్, అధిక రక్తపోటు సమస్యలకు దూరంగా ఉంచొచ్చని చెబుతున్నారు. ఇంతకీ, ఇవి తలెత్తడానికి ప్రధాన కారణాలేంటి? వీటి బారినపడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులే ఈ పరిస్థితికి ప్రధాన కారణమంటున్నారు అసిస్టెంట్‌ ప్రొఫెసర్, జనరల్‌ ఫిజీషియన్ డాక్టర్ శ్రీనివాసులు. నార్మల్​గా మన శరీరం సూర్యోదయం, సూర్యాస్తమయాలకు అనుగుణంగా స్పందిస్తుంది. రాత్రి బాగా పొద్దుపోయాక ఫుడ్ తీసుకుంటే జీవక్రియపై దుష్ప్రభావం చూపుతుంది. జీర్ణక్రియ నెమ్మదించడంతో ఆ ప్రభావం ఆహారంలోని పోషకాలను గ్రహించుకునే శోషణక్రియపై పడుతుందంటున్నారు. ఫలితంగా క్రమేణా శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది. దాంతో గుండెపోటు, మధుమేహం, రక్తపోటు, పక్షవాతం, క్యాన్సర్‌ వంటి వ్యాధులకు దారితీస్తుందని హెచ్చస్తున్నారు.

అదేవిధంగా, ప్రస్తుతం చాలామందిలో శారీరక శ్రమ తగ్గిపోయింది. కూర్చుని పనిచేసేవారి సంఖ్య లక్షల్లో ఉంటున్నారు. వ్యాయామానికి దూరంగా ఉండటం, చరవాణులకు ఎక్కువగా పరిమితమవడం చేస్తున్నారు. అలాగే అధిక బరువు, మద్యపానం, ధూమపానానికి అలవాటు పడటం, తీవ్ర ఒత్తిడికి గురవడం, వేపుళ్లు, జంక్‌ఫుడ్, శీతల పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వంటివి నేడు ఎక్కువ మందిలో బీపీ, షుగర్​తో పాటు వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తడానికి కారణమవుతున్నట్లు పలు అధ్యయనాల్లో వెల్లడైంది.

ఈ లక్షణాలు కనిపిస్తున్నాయంటే - షుగర్​ గా అనుమానించాల్సిందేనట!

ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

  • చిన్న వయసులో షుగర్, బీపీ సమస్యల బారిన పడకుండా ఉండాలంటే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా అవసరమంటున్నారు డాక్టర్ శ్రీనివాస్‌లు.
  • ముఖ్యంగా సమతుల పోషకాహారం తీసుకోవాలి. నూనెతో చేసిన ఆహార పదార్థాలు, జంక్​ఫుడ్​, ప్యాకేజ్డ్ ఫుడ్స్​ను వీలైనంత దూరం పెట్టాలి. మద్యం, ధూమపానం చేయకూడదు.
  • అదేవిధంగా నిత్యం యోగా, ధ్యానం చేయాలి. నడక, వ్యాయామానికి డైలీ గంట సమయం కేటాయించేలా చూసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా మీ వయస్సు, ఎత్తుకు తగ్గట్టు బరువు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.
  • ఏపనినైనా ప్రణాళికాబద్ధంగా చేయడం నేర్చుకోవాలి. నిత్యం ఆరోగ్యంపై దృష్టి సారించడంతోపాటు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలని సూచిస్తున్నారు.

నేషనల్ ఇని​స్టిట్యూట్ ఆఫ్ హెల్త్​ సభ్యుల బృందం జరిపిన ఓ రీసెర్చ్​లోనూ జీవనశైలిలో మార్పులతోపాటు అధిక కేలరీల ఫుడ్​ని నివారించడం చేస్తే రక్తపోటు, మధుమేహం సమస్యల ముప్పును తగ్గించుకోవచ్చని కనుగొన్నారు. అందుకు సంబంధించిన రిపోర్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

'వాకింగ్ ఇలా చేస్తేనే బీపీ, షుగర్, బరువు తగ్గుతుంది'- మరి ఎలా చేయాలో మీకు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.