'పాండా'ల మధ్య కుస్తీ పోటీ.. ఢీ అంటే ఢీ - china panda westling snow in china
🎬 Watch Now: Feature Video
మనుషులేనా కుస్తీ పోటీల్లో తలపడేది మేమూ ఏమాత్రం తక్కువేమి కాదు మాకూ వచ్చు తలపడటం అంటున్నాయి చైనాకు చెందిన పాండాలు. షాంగ్జీ రాష్ట్రంలోని హాన్జాంగ్ నగరంలో విపరీతమైన మంచు కురుస్తోంది. ఫోపింగ్ ప్రాంతంలోని పాండాల విభాగంలో రెండేళ్ల వయసున్న 'జియావో జిన్' అనే మగ పాండ, 'లులూ' అనే ఆడ పాండా మంచులో తలపడిన దృశ్యాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. నువ్వానేనా అంటూ ఆ ప్రాంతంలోని వృక్షాలు ఎక్కుతూ దిగుతూ.. అవి చేసే విన్యాసాలు అబ్బురపరుస్తున్నాయి.