మహిళను చంపేసిన పోలీసు వాహనం - షికాగో

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 11, 2019, 8:45 AM IST

అమెరికాలోని షికాగోలో వేగంగా వెళ్తున్న పోలీసు వాహనం కారును ఢీకొట్టిన ఘటనలో 84 ఏళ్ల విశ్రాంత ఉపాధ్యాయురాలు అక్కడికక్కడే మృతి చెందారు. ఎరుపు సిగ్నల్​ పడి ఉన్నా వేగంగా వచ్చిన పోలీసు వాహనం కూడలిలో మరో పోలీస్ కారును ఢీకొట్టింది. ఆ కారు సిగ్నల్ వద్ద ఆగిఉన్న మరో కారుపై పడింది. అందులోని మహిళ వెరోనా గన్​ మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఘటనలో 10 మంది పోలీసులకూ గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణం ఏంటనే స్పష్టత రాలేదు. విచారణ కొనసాగుతోంది. పోలీసులు అంతర్గత నిబంధనలు పాటించనందునే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొంటూ బాధితుల తరఫు న్యాయవాది కోర్టులో పిటిషన్​ వేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.