ఎరక్కపోయి ఇరుక్కున్నారు.. అదృష్టం బాగుండి తప్పించుకున్నారు - family stuck in Sycamore creek
🎬 Watch Now: Feature Video
అమెరికా ఆరిజోనాలో ఓ కుటుంబం పెను ప్రమాదం నుంచి బయటపడ్డ దృశ్యం థ్రిల్లర్ సినిమాను తలపించింది. ఆ కుటుంబ సభ్యులు, తమ పెంపుడు కుక్కతో కలిసి ఫీనిక్స్ సమీపంలోని టోంటో అడవికి విహారయాత్రకు వెళ్లారు. తిరిగి వచ్చే సమయంలో సికమోర్ వాగును ఎస్యూవీ కారుతోనే దాటేందుకు ప్రయత్నించారు. అంతలోనే నీటి ప్రవాహం పెరిగింది. కారులోకి నీరు చేరింది. మరికొద్ది నిమిషాలు అలాగే ఉంటే కొట్టుకుపోయే ప్రమాదం నెలకొంది. సమయానికి సహాయక సిబ్బంది వారిని సురక్షితంగా ఒడ్డు చేర్చగా కథ సుఖాంతమైంది.
Last Updated : Mar 2, 2020, 12:19 PM IST