ఇటలీ రోడ్లను ముంచెత్తిన బురద- కూరుకుపోయిన వాహనాలు - ఇటలీ బిట్టీ రోడ్లపై పేరుకుపోయిన బురద
🎬 Watch Now: Feature Video
ఇటలీలోని శార్డినియా ప్రాంతంలో తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు.. బిట్టి పట్టణాన్ని బురద ముంచెత్తింది. ఆ వీధుల్లో ఎటు చూసినా బురద మేటలు, రాళ్ల దిబ్బలే కనిపిస్తున్నాయి. ఖరీదైన కార్లు, ఇతర వస్తువులు బురదలో కూరుకుపోయి.. పెద్ద ఎత్తున ఆస్తినష్టం వాటిల్లింది. బిట్టిలోని టౌన్‌హాల్ సమీపంలో వంతెన కూలిపోయింది. బురద మేట తొలగించేందుకు సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. ఆదివారం కూడా శార్డినియా ప్రాంతంలో వర్షం పడే అవకాశముందని ఆ దేశ రక్షణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.