రష్యా: మాస్కో శివారులో భారీ అగ్ని ప్రమాదం - రష్యాలో అగ్ని ప్రమాదం
🎬 Watch Now: Feature Video
రష్యాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మాస్కో శివారులోని ఓ గిడ్డంగిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంటల వల్ల గిడ్డంగిలో నిల్వ ఉంచిన పెయింట్ కంటైనర్లలో పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు. దీంతో మంటలు భారీగా చెలరేగుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది హెలికాఫ్టర్ సాయంతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో ఓ సిబ్బంది గాయపడ్డట్లు స్థానిక మీడియా వెల్లడించింది.