వరదల్లో చిక్కుకున్న రైతు- హెలికాప్టర్​తో రక్షించిన అధికారులు - న్యూజిలాండ్​లో అత్యవసర పరిస్థితి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 30, 2021, 1:15 PM IST

న్యూజిలాండ్​లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కుండపోతగా కురిశాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించి ఆష్బర్టన్ సమీపంలోని పొలాల్లో ఓ రైతు చిక్కుకుపోయారు. ఆయనను అధికారులు హెలికాప్టర్ ద్వారా రక్షించారు. ప్రతికూల వాతావరణం కారణంగా కాంటర్బరీ ప్రాంతంలోని తిమారు, అష్బర్టన్ జిల్లాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాల్లో ఉండే ప్రజలు ప్రయాణాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని స్థానిక మీడియా తెలిపింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.