ETV Bharat / offbeat

వేడి వేడిగా "టమాటా మొక్కజొన్న సూప్" - ఆహాఁ ఆ ఫీలింగే వేరప్పా! - TOMATO CORN SOUP

అదుర్స్ అనిపించే టమాటా కార్న్​ సూప్ - రుచి కేక పెట్టిస్తుంది!

Tomato Soup Recipe
Tomato Corn Soup Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 6, 2025, 1:41 PM IST

Tomato Corn Soup Recipe in Telugu : చాలామంది తేలికగా జీర్ణమయ్యే సూప్‌లను ఏ కాలంలోనైనా ఇష్టంగా లాగించేస్తుంటారు. చికెన్‌, మటన్‌ వంటి వాటితో పాటు రకరకాల కూరగాయలతో ప్రిపేర్ చేసుకునే సూప్‌లు ఆరోగ్యానికి చాలా మంచివి. అలాంటి వాటిల్లో ఒకటి "టమాటా మొక్కజొన్న సూప్‌". చల్లని సాయంత్రం వేళ హాట్​హాట్​గా ఈ సూప్​ గొంతులోకి జారుతుంటే ఎంతో హాయిగా ఉంటుంది. పైగా టమాటా కార్న్ సూప్​ని ప్రిపేర్​ చేసుకోవడం కూడా చాలా ఈజీ. టేస్ట్​ కూడా చాలా బాగుంటుంది! ఒక్కసారి ఇలా చేసి పెడితే ఇంట్లో వాళ్లందరూ ఎంతో ఇష్టంగా తాగేస్తారు. మరి, ఈ సూపర్ టేస్టీ సూప్​ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • స్వీట్‌ కార్న్‌ - కప్పు
  • టమాటాలు - అర కిలో
  • వెన్న - 6 చెంచాలు
  • సన్నని ఉల్లిపాయ తరుగు - కప్పు
  • తురిమిన క్యారెట్‌ - అర కప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • ఉల్లి కాడల తరుగు - చారెడు
  • మిరియాల పొడి - చెంచా
  • చక్కెర - చెంచా
  • కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి - చెంచా
  • కొత్తిమీర తరుగు - పావు కప్పు

రెస్టారెంట్ స్టైల్ "చికెన్ కార్న్ సూప్" - సింపుల్​గా ప్రిపేర్ చేసుకోండిలా! - టేస్ట్ అదుర్స్!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే, ఉల్లిపాయలు, ఉల్లికాడలను తరుక్కొని పక్కనుంచాలి. క్యారెట్ తురుముని సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి.
  • ఇప్పుడు అడుగు భాగం మందంగా ఉండే ఒక గిన్నె పెట్టుకొని బటర్ వేసుకోవాలి. అది కరిగి వేడయ్యాక కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నని ఉల్లిపాయ తరుగు, క్యారెట్‌ తురుముని వేసుకొని అన్నింటినీ రెండు నిమిషాల పాటు చక్కగా వేయించుకోవాలి.
  • అనంతరం అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, చక్కె, ఉల్లి కాడల తరుగు వేసుకొని అన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత సన్న సెగ మీద అరగంటపాటు ఉడికించుకోవాలి. ఆపై దింపి కాస్త చల్లార్చుకోవాలి.
  • అనంతరం పప్పుగుత్తితో మాష్ చేసుకొని రసంలో కలవకుండా పిప్పి మిగిలి ఉంటే దాన్ని బయటకు తీసేయాలి.
  • ఇప్పుడు అందులో స్వీట్​కార్న్ వేసి స్టౌపై పెట్టుకొని మరో నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
  • ఇక చివర్లో కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకుంటే సరి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే ‘టమాటా మొక్కజొన్న సూప్‌’ రెడీ!
  • మరి, నచ్చితే మీరూ ఓసారి ఈ సూప్​ని ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తాగుతారు.

"బీరకాయ సూప్​"తో బరువు, షుగర్​ తగ్గుతాయట! - ఇలా ఈజీగా ప్రిపేర్​ చేసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.