నమ్మి వస్తే గుండెల్లో పెట్టుకుంటాడు.. దటీజ్ మనోజ్: వెన్నెల కిశోర్ - మనోజ్ మౌనిక వెడ్డింగ్
🎬 Watch Now: Feature Video
టాలీవుడ్ కథానాయకుడు మంచు మనోజ్ కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు. ఆయన వివాహం శుక్రవారం రాత్రి భూమా మౌనికా రెడ్డితో ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లోని మోహన్‌బాబు నివాసంలో ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో మనోజ్, మౌనిక వివాహబంధంలోకి అడుగుపెట్టారు. అయితే శుక్రవారం ఉదయమే 'పెళ్లికూతురు భూమా మౌనిక' అంటూ ఆమె ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు మనోజ్. ఆయన్ను పెళ్లి కొడుకును చేస్తున్నప్పటి ఫొటోను మంచు లక్ష్మీ ప్రసన్న సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మాజీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల కుమార్తెనే మౌనిక. ఆమెతో కథానాయకుడు మంచు మనోజ్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. రెండు కుటుంబాల అంగీకారంతో ఈ జంట ఒక్కటైంది. ఈ ఇద్దరికి ఇది రెండో వివాహమే. తాజాగా మనోజ్ పెళ్లి వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. దీనికి కమెడియన్ వెన్నెల కిశోర్ వాయిస్ అందించడం విశేషం. 'పెళ్లి.. మ్యారేజ్.. మూడు ముళ్ల బంధం, ఆరడుగుల అనుబంధం.. సారీ, మావాడు ఆరడుగులు కదా, సో సెంటిమెంటల్‌గా ఉంటుందని బ్రేకింగ్ ద రూల్స్! M, M ఫ్రెండ్స్ కదా.. అలాగే ఉంటాయి మరి!' అంటూ మనోజ్, మౌనికల గురించి ఇంట్రడక్షన్ ఇచ్చాడు వెన్నెల కిశోర్. 'వయసుతో సంబంధం లేకుండా, రేంజును చూడకుండా నచ్చితే నావాడు, మెచ్చితే మనోడు.. అదే మంచు మనోజ్ లైఫ్ స్టైల్. డిగ్రీ సర్టిఫికెట్‌లు ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ స్కూల్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ మాత్రం 14 ఉన్నాయి. మనోడికి ఫారిన్ వెళ్లి మరీ చదివిన సీమబిడ్డ భూమా మౌనికతో ఆ దేవుడు ముడి వేశాడు. వీళ్లిద్దరిదీ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్. నేను నీకెలా సాయపడగలను? అని వాట్సాప్ స్టేటస్ కాకుండా ఏకంగా ప్రొఫైల్ పిక్ పెట్టుకున్నాడు. నమ్మితేనే చేయందిస్తాడు.. అలాంటిది నమ్మి వస్తే గుండెల్లో పెట్టుకుంటాడు. దటీజ్ మనోజ్. ఏడడుగులు.. ఏడేడు జన్మల వరకు అలాగే ఉండాలని కోరుకుంటున్నా.. హ్యాపీ మ్యారీడ్ లైఫ్' అని ముగించాడు వెన్నెల కిశోర్.