SPB Death Anniversary : కృష్ణతో ఎస్పీబీ వివాదం.. ఆ ఫోన్​ కాల్​తో ఇండస్ట్రీయే నలిగిపోయేలా!.. ఆ రోజుల్లో ఏం జరిగిందంటే? - ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కమల్​ హాసన్ అనుబంధం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Sep 25, 2023, 10:51 AM IST

SPB Death Anniversary : ఎన్నో వేల పాటలు పాడి, తన గాన మధుర్యంతో ప్రజల్ని మంత్రముగ్ధుల్ని చేసిన సుప్రసిద్ధ గాయకడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. తన సుమధుర గానంతో శ్రోతలకు వీనుల విందును పంచారాయన. దాదాపు 5 దశాబ్దాల పాటు  16 భారతీయ భాషల్లో 40 వేలకుపైగా పాటలు పాడి గిన్నిస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్స్​ను సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పుడాయన లోకాన్ని విడిచి వెళ్లి దాదాపు మూడేళ్లు దాటేసింది. నేడు ఆయన్ను స్మరించుకుంటూ.. ఆయన గురించి పలు విశేషాలను తెలుసుకుందాం. గతంలో ఆయన ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా(Alitho Saradaga SP  Balasubrahmanyam) కార్యక్రమానికి హాజరై చెప్పిన మాటల్ని విందాం. ఈ షోలో ఆయన సూపర్ స్టార్ కృష్ణతో జరిగిన వివాదం, తెలుగు చిత్రసీమకు రెండు కళ్లలాంటి దిగ్గజ నటులు ఎన్టీఆర్​, ఏఎన్నార్​ సినిమాలకు పని చేసిన అనుభవం, యూనివర్సల్ స్టార్ కమల్​ హాసన్​తో అనుబంధం వంటి విషయాల గురించి మాట్లాడారు. ఆ సంగతుల్ని తెలుసుకుందాం.... 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.