సరికొత్త పంథాలో ఎన్ఆర్ఐ నిర్మాతలు- 'సౌండ్ పార్టీ' సినిమా కోసం 'స్పెషల్' సాఫ్ట్వేర్! - సౌండ్ పార్టీ సిినిమా రిలీజ్
🎬 Watch Now: Feature Video
Published : Nov 20, 2023, 4:00 PM IST
Sound Party Movie Producers Interview : సినీ పరిశ్రమలో నిర్మాతలుగా రాణించాలంటే అన్నీ తెలుసుకున్నాకే అడుగుపెట్టాలంటున్నారు ఇద్దరు ప్రవాస భారతీయులు. అమెరికాలో ఐటీ, స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న మిర్యాలగూడ వాసి రవిపొలిశెట్టి, సంగారెడ్డి నివాసి మహేంద్ర గజేంద్రలు తొలిసారిగా సినీ రంగంలోకి ప్రవేశించి సౌండ్ పార్టీ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 24న ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా తమ అనుభవాలను 'ఈటీవీ భారత్'తో షేర్ చేసుకున్నారు. కళాత్మక వ్యాపారంగా భావించే సినిమా రంగంలో రాణించడం అంత తేలిక కాదంటోన్న రవి, మహేంద్రలు.. ప్రతిభావంతులైన కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులను ప్రోత్సహించేందుకు కొన్నాళ్ల కిందట 'ఫిల్మ్ లింక్డు' అనే సాప్ట్ వేర్ను రూపొందించారు. దాని ద్వారా అమెరికా నుంచే తమ సినిమాకు కావాల్సిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులను ఎంపిక చేసుకొని అనుకున్న బడ్జెట్ లో సినిమాను పూర్తి చేశారు. ఇంటిల్లిపాదికి వినోదాన్ని పంచే తమ తొలి చిత్రం ఆశించిన స్థాయిలో రావడం ఆనందంగా ఉందంటోన్న రవి, మహేంద్రలు.. వరుస చిత్రాలతో సినీ పరిశ్రమలో తమదైన ముద్రవేస్తామని చెబుతున్నారు.