ప్రేయసిని పెళ్లి చేసుకున్న బాలీవుడ్ హీరో - మణిపురి సంప్రదాయంలో ఒక్కటైన జంట - రణ్‌దీప్ హుడా మణిపురీ స్టైల్ మ్యారేజ్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-11-2023/640-480-20145244-thumbnail-16x9-randeep-hooda.jpg)
![ETV Bharat Telugu Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Nov 29, 2023, 10:24 PM IST
|Updated : Nov 30, 2023, 6:08 AM IST
Randeep Hooda Wedding Ceremony : బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌దీప్ హుడా తన ప్రేయసి లిన్ లైస్రామ్‌తో పెళ్లి పీటలెక్కారు. మణిపుర్ ఇంఫాల్‌లోని ఓ దేవాలయంలో వీరి వివాహ వేడుక సింపుల్‌గా జరిగింది. అత్యంత సన్నిహితుల సమక్షంలో మణిపురి స్టైల్లో ఈ జంట ఒకటయ్యారు. అయితే వీరి పెళ్లి వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. సంప్రదాయాలను పాటిస్తూ.. ఈ జంట పెళ్లి జరగడం వీక్షకులను ఆకట్టుకుంటోంది.
పెళ్లి కోసం వధూవరులు సాంప్రదాయ మణిపురి వివాహ దుస్తుల్లో కనిపించారు. రణదీప్ పూర్తిగా తెల్లటి కుర్తా ధోతీ ధరించి కనిపించగా వధువు లిన్ మాత్రం పొట్లోయ్ అనే బలమైన వెదురుతో తయారు చేసిన ఓ డ్రెస్‌ను ధరిచింది. అంతే కాకుండా బంగారు ఆభరణాలు ధరించి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. చూడముచ్చటగా ఉన్న ఈ జంట.. బంధువుల సమక్షంలో వధువు ఇంటి సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు.
Randeep Hooda Marriage Invitation : ఇక రణ్‌దీప్- లిన్ ఎప్పటి నుంచో రిలేషన్షిప్లో ఉన్నారు. అయితే ఇటీవలే తమ రిలేషన్ గురించి రణ్‌దీప్ తొలిసారి ఫ్యాన్స్‌కు చెప్పారు. తమ పెళ్లి ఇన్విటేషన్‌ను సోషల్ మీడియాలో పంచుకుని ఈ గుడ్ న్యూస్‌ను ఆయన వెల్లడించారు. "మహాభారతంలో అర్జునుడు ఎక్కడ అయితే మణిపుర్ యువరాణి చిత్రాంగదను వివాహం చేసుకున్నారో అక్కడే సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో మేం ఒక్కటి కాబోతున్నాం" అంటూ రణ్‌దీప్ చెప్పారు.