మారుతి బడ్జెట్ కష్టాలు.. ఆ సినిమా షూటింగ్​ కోసం 'భార్య' డ్రెస్​లు చోరీ!

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 19, 2023, 6:36 PM IST

సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. ఒక్కసారి హిట్‌ వచ్చిందంటే నెక్స్ట్‌ అంతకు మించిన సినిమా తీయాలి. తేడా కొట్టి ఫ్లాప్‌ అయిందంటే విమర్శలను ఎదుర్కొనేంత సత్తా ఉండాలి. అదే వరుసగా ఫ్లాపులు పడితే మనుగడను కాపాడుకునేందుకు కష్టపడాలి. ఇలా చిత్రపరిశ్రమలో అన్ని సమస్యలను దాటుకుని స్టార్‌ డైరెక్టర్‌ స్థాయికి ఎదిగారు మారుతి. సహ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్‌ ప్రారంభించిన మారుతి 'ఈ రోజుల్లో' చిత్రంతో దర్శకుడిగా మారారు. అందరినీ తన చిత్రాలతో నవ్వించే మారుతి తన భార్య స్పందనతో కలిసి ఈటీవీలో ప్రసారమవుతున్న 'అలా మొదలైంది' సెలబ్రిటీ టాక్​షోకు ఇటీవలే విచ్చేశారు. 

ఈ సందర్భంగా వాళ్లిద్దరి జీవితంలో జరిగిన సరదా సంగతులతో షోలో నవ్వులు పూయించారు మారుతి దంపతులు. స్పందన రాసిన డైరీ వల్లే తమ పెళ్లి జరిగిందంటూ.. ప్రేమించుకున్న రోజులను గుర్తుచేసుకున్నారు. వాళ్ల లైఫ్‌లోని బెస్ట్‌ సర్‌ప్రైజ్‌లు, మర్చిపోలేని జ్ఞాపకాలను పంచుకున్నారు. అయితే మారుతి సహా నిర్మాతగా వ్యవహరించిన 'ఈ రోజుల్లో' చిత్రంలో విషయంలో జరిగిన సంఘటనలను స్పందన తెలిపారు. ఆ మూవీ షూటింగ్​ సమయంలో స్పందన బీరువాలో ఉన్న డ్రెస్సులు మాయమయ్యాయట. తీరా తెరపై ఆ సినిమా చూసినప్పుడు.. మొత్తం తన బట్టలే కనిపించాయట. ఒక్కసారిగా ఆమె షాక్​ అయిందట. దీంతో ఆమె కొత్త డ్రెస్సులు కొనుక్కోవడానికి మారుతిని రూ.10 వేలు అడిగిందట. మారుతి సతీమణి చెప్పిన ఆ సరదా ముచ్చట్లు కోసం వీడియో మొత్తం చూసేయండి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.