థియేటర్లలో 'వీరసింహారెడ్డి' జోరు.. బాలయ్య పాటకు పెద్దాయన డ్యాన్స్ ఇరగదీశాడుగా - వీరసింహారెడ్డి మూవీ టాక్
🎬 Watch Now: Feature Video
తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో వీరసింహరెడ్డి సందడి నెలకొంది. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీంతో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. తమ అభిమాన నటుడి సినిమాను తొలిరోజు తొలి ఆట చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు. బాలయ్య డైలాగ్‌లు, పాటలకు విజిల్స్ వేయడమే కాకుండా స్టెప్పులతో దుమ్మురేపారు. అయితే, ఎక్కడ జరిగిందో తెలియదు గానీ థియేటర్‌లో ఓ పెద్దాయన బాలయ్య పాటకు డ్యాన్స్ ఇరగదీశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST