అవసరాల శ్రీనివాస్ సీక్రెట్ టాలెంట్.. హాలీవుడ్ సినిమాకు డైలాగ్ రైటర్‌గా.. - సుమా అడ్డాలో ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి
🎬 Watch Now: Feature Video
టాలీవుడ్ స్టార్ హీరో అవసరాల శ్రీనివాస్ ఇటీవలే దర్శకుడిగా తన మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. నాగశౌర్య హీరోగా 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' అనే సినిమాను మార్చి 13న ఈ సినిమాను థియేటర్లో రిలీజ్ చేశారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈటీవీలో రన్ అవుతున్న సుమా అడ్డా షోలో మూవీ టీమ్‌తో కలిసి దర్శకుడు అవసరాల శ్రీనివాస్ సందడి చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ను యాంకర్ సుమ కొన్ని ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. హాలీవుడ్ సినిమాలకు పని చేయడం గురించి ఆరా తీశారు. గతేడాది రిలీజై బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన 'అవతార్ ద వే ఆఫ్ వాటర్' సినిమాకు తెలుగు డైలాగ్స్ తానే రాశారని అవసరాల శ్రీనివాస్ తెలిపారు. దీంతో యాంకర్ సుమ ఆయన్ను పాన్ వరల్డ్ స్టార్ అంటూ కొనియాడారు. ఇదే షోకు హాజరైన అబ్బాయి ఫలానా అమ్మాయి చిత్రబృందానికి ఇదే తరహాలో మరికొన్ని సరదా ప్రశ్నలు వేశారు సుమ.
2022లో రిలీజ్ అయిన ప్రముఖ బాలీవుడ్ సినిమా 'బ్రహ్మాస్త్ర' కోసం కూడా పని చేశారు అవసరాల శ్రీనివాస్. ఆ సినిమా తెలుగు వెర్షన్‌కు డైలాగ్స్ ఆయనే రాశారు. ఇక దర్శకుడిగా శ్రీనివాస్ తీసిన 'ఊహలు గుసగుసలాడే', 'జో అచ్యుతానంద' సినిమాలకు థియేటర్లలో మంచి టాక్ లభించింది. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాతో హీరో నాగశౌర్యను మరోసారి తన సినిమాకు హీరోగా తీసుకోవడం విశేషం. వీరిద్దరి కాంబోలో ఇదివరకే 'ఊహలు గుసగుసలాడే' అనే క్లాసిక్ హిట్ రిలీజయ్యింది.