Amitabh Bacchan Birthday : బర్త్​డే సెలబ్రేషన్స్​లో బిగ్​బీ.. 'జల్సా' ముందు ఫ్యాన్స్​ సందడి.. - అమితాబ్​ బచ్చన్​ ఇళ్లు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Oct 11, 2023, 10:37 AM IST

Amitabh Bacchan Birthday : బాలీవుడ్ స్టార్ హీరో, బిగ్​బీ అమితాబ్​ బచ్చన్ నేడు(అక్టోబర్​ 11)న 81 ఏట అడుగుపెట్టారు. దీంతో ఆయన ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. నెట్టింట ఆయనకు విషెస్​ చెబుతూ ట్రెండ్​ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు అభిమానులు.. ముంబయిలో అమితాబ్​ ఇంటి వద్దకు చేరుకుని బర్త్​డే సెలబ్రేషన్స్​ చేశారు. దీంతో 'జల్సా' ఆవరణ సందడి సందడిగా మారింది. పోస్టర్లతో ఆ కాలనీని నింపిన ఫ్యాన్స్​..కేకులు కోస్తూ సందడి చేశారు. గిఫ్ట్​లు, బొకేలు పట్టుకుని ఆయన రాక కోసం ఎదురు చూశారు. దీంతో ఫ్యాన్స్​ను పలకరించేందుకు అమితాబ్​ బయటకు వచ్చారు. ఇంటి ముందు నిల్చుని అభివాదం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. 

Amitabh Bacchan Movies : ఇక అమితాబ్‌ బచ్చన్‌ ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు సౌత్​లోని పలు సినిమాల్లోనూ నటిస్తున్నారు. ప్రభాస్‌ - నాగ్‌ అశ్విన్‌ కాంబోలో తెరకెక్కుతోన్న 'కల్కి 2898 ఏడీ' లో ఆయన కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో ఆయన కనిపించి ఆకట్టుకున్నారు. అలాగే టి.జి. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ నటిస్తోన్న  'తలైవర్ 170'లోనూ  అమితాబ్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని మూవీ టీమ్​ ప్రకటించి.. అమితాబ్‌ పోస్టర్‌ను విడుదల చేసింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.